
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “హరిహర వీరమల్లు” భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఒక్క కన్నడ మినహా అన్ని ప్రధాన భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
కానీ ఓటిటి వెర్షన్‌లో మేకర్స్ కొన్ని కీలక మార్పులు చేశారు. ముఖ్యంగా సినిమా నుండి పలు సన్నివేశాలను పూర్తిగా తొలగించారు. థియేటర్లలో ఉన్న క్లైమాక్స్‌ను కూడా మార్చి, అసుర హననం పాటతోనే చిత్రాన్ని ముగించారు. బాబీ డియోల్, పవన్ కళ్యాణ్ మధ్య కీలక సన్నివేశాన్ని కూడా తొలగించడం గమనార్హం.
ఈ మార్పులు బయటకు రావడంతో సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. కొందరు అభిమానులు ఈ సన్నివేశాలను ఉంచితే సినిమా బాగుండేదని అభిప్రాయపడుతుండగా, మరికొందరు మాత్రం ఎడిటింగ్ నిర్ణయం సరైనదే అని అంటున్నారు.
ఇక ఈ వెర్షన్ చూసినవారు, థియేటర్ వెర్షన్‌తో పోలిస్తే ఫ్లో బాగుందనే కామెంట్స్ చేస్తున్నారు. క్లైమాక్స్ సింపుల్‌గా ముగించడం వల్ల కథ మరింత కాంపాక్ట్‌గా అనిపిస్తోందని కొందరు అంటున్నారు.
మొత్తం మీద ఓటిటిలో “హరిహర వీరమల్లు” కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ ట్విస్ట్ వెర్షన్ ఆడియెన్స్ నుంచి ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.