Sunday, October 4, 2026
HomeMovie Newsనాని కొత్త సినిమా పాత్రపై ఆసక్తికర రూమర్!

నాని కొత్త సినిమా పాత్రపై ఆసక్తికర రూమర్!

nani-role-rumors-the-paradise

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న తదుపరి సినిమా ది ప్యారడైజ్ చుట్టూ ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ‘దసరా’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన నాని, మళ్లీ మరో సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో నాని పాత్రకు మూడు వేర్వేరు కోణాలు ఉన్నాయని టాక్. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్‌లో కూడా ఆయన కనిపించబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు నాని చేసిన పాత్రలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా ఉండబోతుందని అభిమానులు అంటున్నారు.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘దసరా’ తర్వాత ఆయనపై అంచనాలు పెరిగిన నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ పట్ల కూడా భారీ బజ్ ఏర్పడింది. గ్లింప్స్ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు.

అంతేకాకుండా, ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్, ది ప్యారడైజ్ ఓవర్సీస్ రైట్స్‌ను భారీ డీల్‌లో కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా విడుదలకు ముందే బిజినెస్ పరంగా మంచి బలాన్నందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular