fbpx
Sunday, June 8, 2025
HomeNationalఊహించని వివాదంలో యూనియన్ బ్యాంక్

ఊహించని వివాదంలో యూనియన్ బ్యాంక్

union-bank-book-order-controversy

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఇచ్చిన పుస్తకాల ఆర్డర్ దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. మాజీ సీఈఏ కృష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్ రచించిన India@100 అనే పుస్తకానికి రూ.7.25 కోట్ల విలువైన ఆర్డర్ ఇచ్చినట్టు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. 

ఆగస్టు 2024లో విడుదలైన ఈ పుస్తకానికి విడుదలకు ముందే 50 శాతం చెల్లింపులు జరగడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకానికి యూనియన్ బ్యాంక్ మొత్తం 1.89 లక్షల పేపర్‌బ్యాక్ కాపీలు, 10,422 హార్డ్‌కవర్ కాపీలు ఆర్డర్ చేసింది. ఒక్క పుస్తకం ధర రూ.350 నుంచి రూ.597 వరకు ఉండడం గమనార్హం. ఈ కాపీలను దేశవ్యాప్తంగా స్కూల్స్, లైబ్రరీస్, కస్టమర్లకు పంపాలని బ్యాంక్ నిర్ణయించింది.

అయితే సాధారణంగా ఇంగ్లీష్ పుస్తకాలకు ఈ స్థాయిలో భారీ ఆర్డర్లు ఇవ్వడం అరుదు. బ్యాంక్‌కు చెందిన 18 జోనల్ కార్యాలయాల నుంచి తలా పదివేల కాపీల ఆర్డర్ వెళ్లడం అక్రమాలపై ఊహాగానాలకు దారితీస్తోంది. బ్యాంకు వనరుల దుర్వినియోగం జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ వివాదం మధ్యలోనే సుబ్రమణియన్‌ను ఐఎంఎఫ్ పదవి నుంచి కేంద్రం రీకాల్ చేయడం చర్చకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ, బ్యాంకింగ్ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారి తీస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular