
అమెరికా: యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆపిల్ కంపెనీకి షాక్ కలిగించాయి. “అమెరికాలో విక్రయించే ఐఫోన్‌లు అక్కడే తయారవ్వాలి. కాదంటే 25% సుంకం తప్పదు” అంటూ ట్రంప్ హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలతో ఆపిల్ షేర్లు ట్రేడింగ్‌లో 3% తగ్గాయి. ప్రస్తుతం భారత్‌లో భారీ స్థాయిలో ఐఫోన్‌లను తయారు చేస్తున్న ఆపిల్, చైనాపై ఆధారాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉంది.
వివిధ ఫాక్టరీల ద్వారా భారత మార్కెట్‌లో 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లు గత ఏడాదిలో అసెంబుల్ అయ్యాయి. ఇందులో టాటా, ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ కీలకంగా ఉన్నారు.
అయితే ట్రంప్ అభిప్రాయం ప్రకారం, విదేశాల్లో తయారయ్యే ఐఫోన్‌లు అమెరికాలో అమ్మకానికి అనర్హం కావచ్చు. ఇది భారత్‌లో ఆపిల్ పెట్టుబడులపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
ఆపిల్ భవిష్యత్ వ్యూహాల్లో మార్పులు వచ్చే అవకాశముంది. అమెరికాలో తయారీ పెంచడమా, లేక కొత్త ఒప్పందాలద్వారా ఈ సమస్య నుంచి తప్పించుకోవడమా అనేది ఆసక్తికరంగా మారింది.