Friday, April 17, 2026
HomeAndhra Pradeshచంద్రబాబు విజన్‌తో అమరావతి క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి: లోకేశ్

చంద్రబాబు విజన్‌తో అమరావతి క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి: లోకేశ్

chandrababu-amravati-quantum-valley-second-tech-revolution

న్యూస్ డెస్క్: విజయవాడలో జరిగిన అమరావతి క్యాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో అధ్యాయం క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని స్పష్టం చేశారు.

అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తామని తెలిపారు. ఆవిష్కరణలు పరిశ్రమలుగా మారేలా పూర్తి ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. ఇది కేవలం ఒక సమావేశం కాదు, దేశ వ్యాప్తంగా ప్రారంభమైన సాంకేతిక ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారనుంది.

156 క్యూబిట్ల సామర్థ్యం గల ఐబీఎం క్యాంటమ్ సిస్టమ్-2 త్వరలో అమరావతిలో అందుబాటులోకి రానుంది. ఇది దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆసియాలో మొట్టమొదటి క్వాంటమ్ ప్రమాణాల టెస్ట్‌బెడ్ కూడా ఇక్కడే ఏర్పాటవుతుంది.

ఈ ప్రాజెక్టులో ఐబీఎం, టీసీఎస్, హెచ్‌సీఎల్ వంటి సంస్థలు భాగస్వాములవుతాయి. ఐఐటీలు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఈ ప్రయత్నానికి తోడ్పడనున్నాయి.

చంద్రబాబు ఐటీ విప్లవానికి నాంది పలికినట్టు ఇప్పుడు క్వాంటమ్ రంగంలోనూ అదే దారిలో ముందుకెళ్తున్నారు. ఇది అమరావతికి సాంకేతిక శక్తిగా మారే దిశలో ముఖ్యమైన అడుగని నారా లోకేశ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular