
అమెరికా: డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్న ఘటనపై సీక్రెట్ సర్వీస్ చివరకు కఠిన నిర్ణయం తీసుకుంది. భద్రతా లోపాలకు బాధ్యులైన ఆరుగురు ఏజెంట్లను సస్పెండ్ చేసింది.
2024 జూలై 13న పెన్సిల్వేనియాలో బట్లర్ కౌంటీలో ట్రంప్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపాడు. తూటా ట్రంప్ చెవిని తాకడంతో ప్రాణాపాయం తప్పింది.
ఈ ఘటనపై సెనేట్ కమిటీ విచారణ జరిపి, సీక్రెట్ సర్వీస్ భద్రతా చర్యల్లో తీవ్రమైన లోపాలున్నాయని నివేదికలో పేర్కొంది. ఏజెంట్ల మధ్య సమన్వయ లోపం కూడా తీవ్రంగా ఎత్తిచూపింది.
ఈ నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ మ్యాట్ క్విన్ మాట్లాడుతూ, తమ వైఫల్యానికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నామని ప్రకటించారు.
సస్పెన్షన్‌కు గురైన ఏజెంట్లకు ఇకపై కీలక బాధ్యతలు అప్పగించబోమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
trump assassination attempt, secret service suspension, us elections 2024, trump security lapse, matthew crooks trump shooting,