న్యూస్ డెస్క్: 26/11 ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తహవర్ రాణా కస్టడీని పాటియాలా హౌస్ కోర్టు మరోసారి పొడిగించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన రాణా కస్టడీని ఆగస్టు 13 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో ఎన్ఐఏ ఇటీవల అనుబంధ ఛార్జీషీట్‌ను దాఖలు చేసింది. హెడ్లీతో రాణా చేసిన టెలిఫోన్ సంభాషణల ఆధారంగా విచారణ సాగుతోంది. రాణా గొంతు, చేతిరాత నమూనాలను అధికారులు ఇప్పటికే సేకరించారు.
హెడ్లీకి రాణానే మ్యాప్‌లు, నోట్స్ అందించాడని ఎన్ఐఏ అనుమానిస్తోంది. అయితే ఈ ఆరోపణలను రాణా తూర్పు ఖండించాడు. ముంబై దాడులతో తనకు సంబంధం లేదని చెప్పాడు.
హెడ్లీ చిన్ననాటి స్నేహితుడని, దాడుల ప్రణాళికలో అతడే బాధ్యత వహించాడని రాణా తెలిపాడు. విచారణ సమయంలో కేరళ వెళ్లిన విషయాన్ని అంగీకరించాడు.
రాణా ఒకప్పుడు పాకిస్థాన్ సైన్యంలో వైద్యుడిగా పనిచేశాడు. అమెరికా నుంచి భారత్‌కు ఆయనను విచారణ నిమిత్తం తీసుకువచ్చిన విషయం తెలిసిందే.