
న్యూస్ డెస్క్: స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండవ రోజు అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కనిపించింది. ఫలితంగా కీలక సూచీలు పతనమయ్యాయి.
ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, మధ్యలో అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 83,134 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. చివరికి 345 పాయింట్ల నష్టంతో 83,190 వద్ద ముగిసింది.
నిఫ్టీ కూడా 120 పాయింట్లు నష్టపోయి 25,355 వద్ద క్లోజ్ అయింది. ముఖ్యంగా 25,400 స్థాయి కోల్పోవడం మార్కెట్‌కు నెగటివ్ సంకేతం.
అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడం, కంపెనీల త్రైమాసిక ఫలితాల ముందు మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడం మార్కెట్‌పై ప్రభావం చూపింది.
ఐటీ షేర్లలో అమ్మకాలు భారీగా వెల్లువెత్తాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి. మారుతీ, బజాజ్ ఫైనాన్స్ లాభపడిన షేర్లలో ఉన్నాయి.
బ్రెంట్ క్రూడ్ ధర 69.44 డాలర్లకు చేరగా, బంగారం ఔన్సు ధర 3,331 డాలర్ల వద్ద ఉంది. రూపాయి మారకం విలువ 85.67 వద్ద కొనసాగుతోంది.