
న్యూస్ డెస్క్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్రాత్మక ప్రదర్శనతో భారత్ 336 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టెస్టు గెలిచిన తొలి ఆసియా కెప్టెన్‌గా గిల్ అరుదైన రికార్డు నమోదు చేశాడు.
భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ గిల్ 269 పరుగులతో దుమ్మురేపగా, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 587 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది. సిరాజ్ 6 వికెట్లు, ఆకాశ్ దీప్ 4 వికెట్లు తీశారు.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ మరోసారి మెరుపు ప్రదర్శనతో 427/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. గిల్ మరో శతకం (161), పంత్ 72, జడేజా 54 రాణించారు. ఇంగ్లండ్‌కు 608 పరుగుల భారీ లక్ష్యం ఎదురైంది.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌట్ అయింది. ఆకాశ్ దీప్ 6 వికెట్లు, సిరాజ్, జడేజా, వాషింగ్టన్, ప్రసిధ్ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో ఆకాశ్ దీప్ మొత్తం 10 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఇక గిల్ కెప్టెన్సీలో డబుల్ సెంచరీ, ఫాలోఅప్‌లో సెంచరీ చేసి కోహ్లీ, కపిల్‌లను దాటాడు.