
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ గా తన డెబ్యూ చేశారు. ఆయన రూపొందించిన ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. ఈ సిరీస్ పై మిశ్రమ స్పందన వస్తోంది.
మొదటి ఎపిసోడ్స్ లో సిరీస్ స్టైల్, ప్రెజెంటేషన్ బాగానే నచ్చినా, తర్వాతి ఎపిసోడ్స్ లాగ్ అయిపోయాయని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం పెద్దగా ఇంప్రెస్ చేయలేదని అభిప్రాయం.
ఈ సిరీస్ లో మోనా సింగ్, గౌతమీ కపూర్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నా, వారిని సరిగ్గా ఉపయోగించలేదని ట్రోల్ అవుతున్నారు. రాఘవ్ జుయాల్ మాత్రం తన నటనతో ఆకట్టుకున్నాడు. కానీ బాబీ దేవోల్ పై ఉన్న హైప్ మాత్రం అందుకోలేకపోయిందని నెటిజన్లు చెబుతున్నారు.
బాలీవుడ్ పై సెటైరికల్ టచ్ తో సాగిన కథలో నెపోటిజం, విమర్శల గురించి ప్రస్తావించారు. కానీ కొత్తగా చెప్పేదేమీ లేకపోవడం, ఎక్కువగా తెలిసిన విషయాలనే రిపీట్ చేయడం ఆడియెన్స్ కు నిరుత్సాహం కలిగించిందని కామెంట్స్ వచ్చాయి.
కొంతమంది ఈ సిరీస్ ను డీసెంట్ అటెంప్ట్ అంటుండగా, మరికొందరు “ఎపిసోడ్స్ ఎక్కువైపోవడంతో బోర్ కొట్టింది” అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే ఈ సిరీస్ ఎక్సపెక్టేషన్స్ ను అందుకోలేకపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
