దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల బాట పట్టాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో నష్టాలు చవిచూసిన సూచీలు ఈ రోజు పాజిటివ్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాలు, ద్రవ్యోల్బణం తగ్గుదల మార్కెట్‌కు బలాన్ని ఇచ్చాయి.
బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 317 పాయింట్లు పెరిగి 82,570 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 25,195కి చేరుకుంది. రూపాయి విలువ డాలరుతో పోలిస్తే ₹85.82 వద్ద ఉంది.
బీఎస్ఈలో సన్ ఫార్మా, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు మంచి లాభాలు నమోదు చేశాయి. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ వంటి షేర్లు కూడా మద్దతు చూపాయి.
కానీ హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రం నష్టపోయాయి. ఐటీ రంగంలో కొంత నెమ్మదిగా ట్రేడింగ్ కనిపించింది.
అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్టానికి చేరడం కీలకంగా నిలిచింది. దీనితో ఇన్వెస్టర్లలో విశ్వాసం కనిపించింది.
వచ్చే రోజుల్లో ఫలితాలు ప్రకటించనున్న కొన్ని కీలక కంపెనీలు మార్కెట్ ట్రెండ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.