
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని స్వాగతిస్తారు. భాష, బ్యాక్‌డ్రాప్ తో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే సినిమాలను హిట్ చేస్తారు. అందుకే కన్నడ, తమిళ, హిందీ చిత్రాలు కూడా తెలుగులో డబ్బింగ్ వెర్షన్ రూపంలో పెద్ద సక్సెస్ సాధిస్తున్నాయి. అయితే ఇప్పుడు శాండల్ వుడ్ ఇండస్ట్రీ టాలీవుడ్లో కొత్త రికార్డ్ సృష్టించింది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన రెండు కన్నడ సినిమాలు ఉన్నాయంటే అదే పెద్ద విషయమని చెప్పాలి. అవి కేజీఎఫ్ చాప్టర్ 2 మరియు కాంతార చాప్టర్ 1. కేజీఎఫ్ 2 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టింది. కేవలం తెలుగులోనే రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంది.
ఇప్పుడు కాంతార చాప్టర్ 1 కూడా అదే ఫీట్‌ని రిపీట్ చేసింది. రిలీజైన మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించి, తెలుగు మార్కెట్లో అరుదైన రికార్డ్‌ను నమోదు చేసింది.
ఈ రెండు సినిమాలు కంటెంట్ బలం మీదే ఈ స్థాయికి చేరాయి. భారీ ప్రమోషన్స్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్‌తో పాటు రియలిస్టిక్ నేరేషన్ ప్రేక్షకులను కట్టిపడేసింది. కాబట్టి శాండల్ వుడ్ ఇప్పుడు టాలీవుడ్లో సత్తా చాటిన పరిశ్రమగా నిలిచిపోయింది.
