Wednesday, June 10, 2026
HomeMovie Newsదేవుడి ప్రణాళికే ముఖ్యం: హీరోయిన్ సంయుక్త మాటల్లో!

దేవుడి ప్రణాళికే ముఖ్యం: హీరోయిన్ సంయుక్త మాటల్లో!

samyuktha-menon-career-philosophy-gods-plan-release-dates

న్యూస్ డెస్క్: మలయాళ నటి సంయుక్తా మీనన్ తన కెరీర్ ప్లానింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన ప్రణాళిక కంటే దేవుడి రాతేముఖ్యమని, తన సినిమాల విడుదలలు అనుకోకుండా వెనుకకు ముందు జరుగుతాయని ఆమె తెలిపింది.

ఆమె ఏకకాలంలో భీమ్లా నాయక్, విరూపాక్ష, బింబిసార, సార్ చిత్రాలకు సంతకం చేసింది. కానీ వాటి విడుదలలు అనుకున్న విధంగా జరగలేదు. ముందు అనుకున్నది వెనక్కి, వెనుక అనుకున్నది ముందుగా రిలీజ్ అయ్యాయి.

ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. స్వయంభూ, నారీ నారీ నడుమ మురారి సినిమాల కంటే ముందే అఖండ 2 సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మార్పులపై తాను ఎప్పుడూ నిరుత్సాహపడలేదని, దైవాన్ని మించి ఏదీ లేదని ఆమె అభిప్రాయపడింది.

ఈ ఏడాది ముగింపులో అఖండ 2 మాత్రమే ఆమె నుంచి వస్తున్న చిత్రం. కానీ 2026లో మాత్రం సంయుక్త మీనన్ నుంచి వరుస రిలీజ్‌లు ఉన్నాయి. దాదాపు ఆరేడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

తెలుగులో స్వయంభూ పూరి-విజయ్ సేతుపతి సినిమాల్లో నటిస్తోంది. మాలీవుడ్‌లో రామ్, బాలీవుడ్‌లో క్వీన్ ఆఫ్ క్వీన్స్ వంటి భారీ చిత్రాలు ఆన్ సెట్స్‌లో ఉన్నాయి. కొత్త ఏడాదిలో సంయుక్త సందడి షురూ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular