
థియేటర్లో సమంత కనిపించి రెండేళ్లు అవుతోంది. ఖుషి తర్వాత నుంచి ఆమె పెద్దగా కనిపించలేదు. చిన్న గెస్ట్ రోల్ చేసినా, అభిమానులు ఆశించినంత సంతృప్తి ఇవ్వలేకపోయింది. ఈ గ్యాప్‌పై సమంత తాజాగా స్పందించింది.
గ్రాజియా ఇండియా మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వల్లే సినిమాలు తగ్గించుకున్నానని తెలిపింది. “ఏడాదికి ఐదు సినిమాలు చేయడం కంటే, అందరికీ గుర్తుండిపోయే ఒక గొప్ప పాత్ర చేయడమే నాకు ముఖ్యం” అని చెప్పింది. ఆమె సామాజిక సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నట్లు వివరించింది.
ప్రస్తుతం సమంత ‘రక్త్ బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. రాజ్ & డీకే పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై నెట్‌ఫ్లిక్స్ భారీ బడ్జెట్ ఖర్చు చేస్తోంది. కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ఆగిపోయిందనే వార్తలు వచ్చినా, ప్రొడ్యూసర్లు వాటిని ఖండించారు. షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో ఇంకా క్లారిటీ లేదు.
అదనంగా, ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా సమంత ఇప్పటికే ప్రకటించింది. దీనికి నందినిరెడ్డి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. రామ్‌చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందనే వార్తలు మాత్రం గాసిప్‌గానే మిగిలిపోయాయి.
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువ చర్చ జరుగుతున్నా, ఆమె తన ప్రొఫెషనల్ జర్నీని కొత్త దిశలో తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఏదో ఒక రూపంలో మీడియా, సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా యాక్టివ్‌గా ఉండటం మాత్రం ఆమె ప్రత్యేకత.