
న్యూస్ డెస్క్: ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతికి గాయం కావడంతో రెండో రోజు ఆటకు దూరమయ్యాడు. తొలి రోజు ఆటలో బంతి అతడి ఎడమ చేతి చూపుడు వేలిని బలంగా తాకింది.
బంతి తగిలిన వెంటనే పంత్ మైదానం విడిచి వెళ్లగా, ధ్రువ్ జురెల్ అతడి స్థానంలో కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. బీసీసీఐ తాజా ప్రకారం, పంత్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని, గాయం తీవ్రతపై నిరంతరం పరిశీలన కొనసాగుతోందని తెలిపింది.
రెండో రోజు ఆట ప్రారంభానికి సమయానికి కూడా పంత్ కోలుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు గమనిస్తుండగా, ఫీల్డింగ్‌కి తాను అందుబాటులో లేడని స్పష్టంగా తెలిపాడు.
బీసీసీఐ మరో ప్రకటన విడుదల చేసే వరకు అతడి మిగిలిన మ్యాచ్‌లకు హాజరు గురించి స్పష్టత లేదు. పంత్ గాయం తీవ్రంగా ఉంటే సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టుల నుంచి దూరమయ్యే అవకాశం ఉంది.
అంతవరకూ, ధ్రువ్ జురెల్ కీపింగ్ బాధ్యతలు కొనసాగించనున్నాడు. అభిమానులు మాత్రం పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.