
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం రెండు సినిమాల పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇవి కాకుండా రజినీ తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తికరమైన బజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజా వార్తల ప్రకారం యువ దర్శకుడు హెచ్ వినోద్‌తో రజినీకాంత్ సినిమా చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వినోద్ దళపతి విజయ్‌తో ‘జన నాయగన్’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వినోద్ రెండు సార్లు రజినీని కలిసినట్లు సమాచారం. ఈ భేటీల్లో రజినీ వినోద్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వినోద్ గతంలో ‘ఖాకీ’, ‘వలిమై’, ‘తునివు’ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ ఎమోషన్ మిక్స్ చేయడంలో ఆయన స్పెషలిస్ట్.
ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తో తలైవర్ కాంబో అంటే అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అధికారిక ప్రకటన కోసం మాత్రం వేచి చూడాల్సిందే.
rajinikanth, h vinoth, thalaivar next film, tamil cinema buzz, kollywood news,