
కోలీవుడ్‌లో ఒకే సినిమాతో అనేక సమీకరణాలు మారిపోతున్నాయి. 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారన్న వార్త ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల మీడియాతో మాట్లాడిన రజనీకాంత్, కమల్‌తో కలిసి నటించేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పారు. అయితే స్టోరీ, డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదని వెల్లడించారు. దీంతో, ఈ మల్టీస్టారర్‌ను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తారనే ప్రచారం కేవలం రూమరేనని స్పష్టమైంది.
జైలర్ 2 తర్వాత ఈ సినిమా మొదలవుతుందని రజని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను రాజ్ కమల్ ఇంటర్నేషనల్, రెడ్ జైంట్ ఫిలిమ్స్ కలిసి నిర్మించనున్నాయి. అందువల్ల కమల్ హాసన్ ప్రాజెక్ట్‌లో భాగమని సందేహం లేదు.
అయితే డైరెక్టర్ విషయంలో ఇంకా అనేక పేర్లు వినిపిస్తున్నాయి. లోకేష్ కాకుంటే వినోద్, కార్తిక్ సుబ్బరాజు, ఆదిక్ రవిచందర్ లాంటి డైరెక్టర్ల పేర్లు చర్చలో ఉన్నాయి.
రజనీ తాజా సినిమా కూలి ఫలితం నిరాశపరిచినందున ఈసారి స్ట్రాంగ్ స్టోరీ, డైరెక్షన్ అవసరమని అభిమానులు అంటున్నారు. కమల్-రజనీ మల్టీస్టారర్‌ను హ్యాండిల్ చేయగలిగేది లోకేష్ మాత్రమేనని చాలామంది భావిస్తున్నా, తుది నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే.
ఈ సినిమా అధికారికంగా అనౌన్స్ అయ్యే వరకు రకరకాల రూమర్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఒకసారి కన్ఫార్మ్ అయితే, ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద మల్టీస్టారర్‌గా నిలవడం ఖాయం.