
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్‌పై అనూహ్యమైన పుకార్లు షికారు చేస్తున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ అవుట్‌పుట్ విషయంలో తారక్ సంతృప్తిగా లేరని, దర్శకుడితో తీవ్ర అభిప్రాయ భేదాలు రావడంతో షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వ్యాపించాయి. దీంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఈ ఊహాగానాలపై మైత్రీ మూవీ మేకర్స్ నుంచి గానీ, చిత్ర బృందం నుంచి గానీ ఎలాంటి స్పందన రాకపోవడం ఈ ఆందోళనలను మరింత పెంచుతోంది. ప్రాజెక్ట్ నిజంగానే ఆగిపోయిందా ఏంటి అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
అయితే, ఈ ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని, ఇదంతా ప్రశాంత్ నీల్ వర్కింగ్ స్టైల్‌లో భాగమని ఇండస్ట్రీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. నీల్ ఎప్పుడూ ఒక షెడ్యూల్ పూర్తయ్యాక, ఫుటేజ్‌ను సమీక్షించి, తదుపరి షెడ్యూల్ స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడం అలవాటు.
‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలకు కూడా ఆయన ఇదే పద్ధతిని అనుసరించారు. ఇది సృజనాత్మక ప్రక్రియలో భాగమే తప్ప, విభేదాల వల్ల వచ్చిన గ్యాప్ కాదు. ప్రస్తుతం ఆయన తదుపరి షెడ్యూల్ కోసం స్క్రిప్ట్‌ను ఫైన్ ట్యూన్ చేసే పనిలో ఉన్నారని సమాచారం.
పెద్ద హీరోల సినిమాలకు ఇలాంటి రూమర్లు రావడం సర్వసాధారణం. గతంలో తారక్ ‘దేవర’ సినిమా సమయంలోనూ ఇలాంటి ప్రచారమే జరిగింది. కానీ, టీమ్ సైలెంట్‌గా తమ పని తాము చేసుకుని వెళ్లి, బ్లాక్‌బస్టర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
కాబట్టి, తారక్-నీల్ మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు పూర్తిగా అవాస్తవం. తారక్ ఈ సినిమా కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో, ఎలాంటి రాజీ పడకుండా సినిమాను చెక్కుతున్నారు. ఈ పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది.
