
‘హాయ్ నాన్న’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శౌర్యువ్, తన ఎమోషనల్ టేకింగ్‌తో మంచి గుర్తింపు పొందారు. అయితే ఆ సినిమా తర్వాత ఆయన నుంచి ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ కాకపోవడం ఆశ్చర్యంగా మారింది. ఈ గ్యాప్‌లో తారక్‌తో సినిమా ఉంటుందని బలంగా ప్రచారం జరిగినా, అది ఫలితం ఇవ్వలేదు.
ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో శౌర్యువ్ కథ ఆగిపోయినట్లు తెలుస్తోంది. కానీ అదే సమయంలో డెబ్యూ హీరో నానితో మరోసారి కలసే అవకాశంపై చర్చలు వేగంగా సాగుతున్నాయని సమాచారం. స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టిన శౌర్యువ్‌కు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ కథ నూతన జోనర్‌తో యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందట. పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత, నాని సుజీత్ సినిమా పూర్తయ్యాక శౌర్యువ్ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. వచ్చే ఏడాది ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుందని టాక్.
ఈ సినిమాను నాని మేనేజర్ ఎస్. వెంకట్ రత్నం నిర్మించనున్నారని సమాచారం. ఇది ఆయన నిర్మాతగా మొదటి సినిమా కావడం విశేషం. మరో టాప్ ప్రొడ్యూసర్ సహనిర్మాతగా ఉండనున్నట్టు సమాచారం.
nani upcoming movie, shauryuv next film, tarak dropped project, nani manager production, telugu cinema news,