
న్యూస్ డెస్క్: విశాఖపట్నంలో జనసేన పార్టీ నేతలతో సమావేశమైన ఎమ్మెల్సీ నాగబాబు వైఎస్సార్‌సీపీ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి మరో 20 ఏళ్ల పాటు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు.
పదవుల విషయంలో కార్యకర్తలు అసంతృప్తిగా ఉండకూడదని నాగబాబు పిలుపునిచ్చారు. “నామినేటెడ్ పోస్టులు లెక్క ప్రకారం వస్తాయి, అందరూ శాంతంగా ఉండాలి” అని తెలిపారు. తనకు అనకాపల్లి లోక్‌సభ టికెట్ ఆశగా ఉన్నా, పార్టీ నిర్ణయాన్ని గౌరవించి తానే తగ్గుకున్నానని చెప్పారు.
నేతల మధ్య అపార్థాలు వస్తే సమన్వయ కమిటీ పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, పార్టీలో ఏ చిన్న అసంతృప్తికీ స్పందించరాదని సూచించారు.
ఈ సమావేశానికి విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు హాజరయ్యారు.