
దక్షిణ భారత సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సైమా అవార్డ్స్ 2025 దుబాయ్‌లో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈసారి టాలీవుడ్ విభాగంలో మళ్లీ మహేష్ బాబు, అల్లు అర్జున్ మధ్యే హాట్ చర్చ మొదలైంది.
2024లో విడుదలైన పుష్ప 2లో నటనతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. ఈ పాత్రకుగాను ఆయన బెస్ట్ యాక్టర్ (తెలుగు) అవార్డును దక్కించుకున్నారు. ఇది బన్నీకి మూడోసారి సైమా ఉత్తమ నటుడి గౌరవం. అలా వైకుంఠపురంలో, పుష్ప-1, పుష్ప-2 వరుసగా ఆయనకు బెస్ట్ యాక్టర్ ట్యాగ్ తెచ్చిపెట్టాయి.
అయితే ఇప్పటికీ సైమాలో అత్యధిక బెస్ట్ యాక్టర్ అవార్డులు గెలుచుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబే. ఆయన ఇప్పటి వరకు నాలుగు సార్లు ఈ గౌరవాన్ని పొందారు. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, మహర్షి సినిమాలకు మహేష్ ఈ అవార్డులు అందుకున్నారు.
2011 నుంచి 2024 వరకు సైమా బెస్ట్ యాక్టర్ లిస్ట్‌ని పరిశీలిస్తే, మహేష్ బాబు ఫస్ట్ ప్లేస్‌లో, అల్లు అర్జున్ సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. ఇక 2025లో ఎవరు గెలుస్తారో ఆసక్తి నెలకొంది. మహేష్ బాబు, బన్నీ తర్వాత ఇప్పుడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నాని లాంటి స్టార్‌లు కూడా ఈ పోటీలో నిలవగలరా అన్నది చూడాలి.
2011 – మహేష్ బాబు ( దూకుడు )
2012 – పవన్ కళ్యాణ్ (గబ్బర్ సింగ్)
2013 – మహేష్ బాబు (SVSC )
2014 – బాలకృష్ణ (లెజెండ్)
2015 – మహేష్ బాబు (శ్రీమంతుడు )
2016 – ఎన్టీఆర్ (జనతా గ్యారేజ్ )
2017 – ప్రభాస్ (బాహుబలి 2)
2018 – రామ్‌చరణ్ ( రంగస్థలం )
2019 – మహేష్ బాబు (మహర్షి)
2020 – అల్లు అర్జున్ ( అలా వైకుంఠపురంలో)
2021 – అల్లు అర్జున్ (పుష్ప 1)
2022 – ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)
2023 – నాని (దసరా)
2024 – అల్లు అర్జున్ (పుష్ప 2)