
విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం కింగ్డమ్ యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా జూలై 31న విడుదలై, మంచి టాక్‌తో బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది.
అమెరికాలో ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కాగా, మొదటి నాలుగు రోజుల్లోనే నార్త్ అమెరికాలో $1.4 మిలియన్ గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. వీకెండ్ ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించాడు. వీరి మధ్య సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అనిరుధ్ అందించిన సంగీతం కూడా సినిమాకు బలాన్ని ఇచ్చింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. తెలుగు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది.
యూఎస్ బాక్సాఫీస్‌లో విజయ్ దేవరకొండకు ఇదే వరకు వచ్చిన అత్యధిక ఓపెనింగ్స్ ఇవే కావడం విశేషం. కింగ్డమ్ విజయంతో విజయ్ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్ నమోదు అవుతోంది.
