
సౌత్‌లో వరుసగా సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా ఎదిగిన కీర్తి సురేష్, పెళ్లి తర్వాత తన కెరీర్‌లో కొంత స్లోగా మారింది. చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తానని చెప్పినా, కొత్త ప్రాజెక్టులు సైన్ చేయడంలో ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు.
పెళ్లికి ముందు కమీటైన సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. కొత్త సినిమాలను పెద్దగా అనౌన్స్ చేయకపోవడంతో, ఆమె కెరీర్‌పై ప్రశ్నలు తలెత్తాయి. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి స్వయంగా తన నిర్ణయాలను వివరించారు.
తనకు ఇంకా చాలా ప్రయాణం మిగిలి ఉందని, తొందరపడి సినిమాలు ఎంచుకోవడం ఇష్టంలేదని ఆమె అన్నారు. ముఖ్యంగా మంచి కథలు, కొత్త ఛాలెంజ్‌లు ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
బాలీవుడ్‌లో చేసిన బేబీ జాన్ సినిమా తన కెరీర్‌లో కొత్త అధ్యాయం అని కీర్తి భావిస్తున్నారు. అక్కడి వర్క్ కల్చర్, కొత్త అనుభవాలు తనకు చాలా విషయాలు నేర్పుతున్నాయని పేర్కొన్నారు.
గ్లామర్ రోల్స్, నటన ప్రధానమైన సినిమాలు రెండూ చేయగలననే నమ్మకంతో ఉన్నానని, ఈ కొత్త జర్నీని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని కీర్తి చెప్పారు.
మొత్తానికి, హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం వెనుక కీర్తి సురేష్ అసలైన కారణం కొత్త అనుభవాలు, ఛాలెంజింగ్ రోల్స్ నేర్చుకోవాలనే తపన అని చెప్పొచ్చు.