
తెలుగు సినీ పరిశ్రమకు కొత్త గర్వకారణంగా నిలిచింది కన్నప్ప సినిమా. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించి, మోహన్ బాబు నిర్మించిన ఈ భక్తిరస చిత్రం తాజాగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించబడింది. ఇది తెలుగు సినిమాకు వచ్చిన అరుదైన గుర్తింపు.
ఈ ప్రత్యేక ప్రదర్శనకు కేంద్ర సమాచార శాఖ అధికారులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారు కన్నప్ప చిత్రంలోని విజువల్స్, ఆధ్యాత్మికత, ఎమోషనల్ డెప్త్‌ను ప్రశంసించారు. ముఖ్యంగా చివరి 40 నిమిషాల కథనం వారిని ప్రత్యేకంగా ఆకట్టుకుందని తెలిపారు.
విష్ణు మంచు నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పాత్ర పట్ల ఆయన చూపిన నిబద్ధత, స్క్రీన్ ప్రెజెన్స్ అందరికీ నచ్చింది. దేశవ్యాప్తంగా స్పిరిచువల్ వర్గాల్లో ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనలు జరుగుతుండటం విశేషం.
విజయవాడలో అఘోరాలతో కలిసి వీక్షించిన షో, భక్తుల నుంచి వచ్చిన స్పందన సినిమా పరిధిని మరింత విస్తరించాయి. భక్తి సినిమాల్లో ఇది మైలురాయిగా నిలుస్తోంది.
రాష్ట్రపతి భవన్‌లో స్క్రీనింగ్ కావడం తెలుగు భక్తి చిత్రాలకు జాతీయ స్థాయిలో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. కన్నప్ప సినిమాతో భక్తి చిత్రాల కొత్త అధ్యాయం మొదలైంది అనే చెప్పాలి.
