Tuesday, August 25, 2026
HomeMovie Newsకన్నప్ప మూవీకి బిగ్ షాక్: ప్రభాస్ సీన్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ మిస్!

కన్నప్ప మూవీకి బిగ్ షాక్: ప్రభాస్ సీన్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ మిస్!

kannappa-prabhas-scenes-hard-drive-missing

మంచు విష్ణు నటిస్తున్న భారీ మైథలాజికల్ చిత్రం కన్నప్ప నుంచి ఊహించని సంఘటన ఒక్కసారిగా టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ హార్డ్ డ్రైవ్ మిస్ కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ డ్రైవ్‌లో ప్రముఖ హీరో ప్రభాస్ నటించిన సన్నివేశాలు ఉన్నట్లు సమాచారం.

ప్రభాస్ ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా, దాని నిడివి దాదాపు 30 నిమిషాల వరకు ఉంటుందట. ఇందులో ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్‌ల ఫ్యూటేజ్ హార్డ్ డ్రైవ్‌లో ఉండడంతో, అది మిస్ కావడంతో టీమ్ తీవ్రంగా అప్రమత్తమైంది. 

ప్రస్తుతం చిత్ర యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ డ్రైవ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఫుటేజ్ గల్లంతవ్వడం వల్ల అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ప్రభాస్ లాంటి స్టార్ కోసం ప్రత్యేకంగా తెరకెక్కించిన సన్నివేశాలు కనిపించకుండా పోవడం పెద్ద విషాదమనే చెప్పాలి.

ఈ డ్రైవ్‌లోని వీడియోలు లీక్ అయితే భద్రతా లోపాలపైనా ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. కన్నప్ప టీమ్ దీనిని ఎంత త్వరగా పరిష్కరించుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

MalCare WordPress Security Plugin - Malware Scanner, Cleaner, Security Firewall Firewall

Blocked because of Malicious Activities

Reference ID: 9909096616a8e1c0e40c24