fbpx
Friday, June 13, 2025
HomeMovie Newsకన్నప్ప హైప్ పెంచాల్సిన సమయం ఇదే!

కన్నప్ప హైప్ పెంచాల్సిన సమయం ఇదే!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్‌కు దగ్గరపడుతోంది. మహాశివుడి భక్తుడు కన్నప్ప జీవితాన్ని ఆధారంగా తీసుకుని ముఖేష్ కుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ వంటి పెద్ద నటీనటులు గెస్ట్ రోల్స్ చేస్తున్నారు.

ఏప్రిల్ 25న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, మేకర్స్ ప్రామోషన్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇటీవల శ్రీకాళహస్తిలో టీజర్ ప్రివ్యూతో పాటు, ముంబైలో గ్రాండ్ ఈవెంట్ చేశారు. అయితే, ఇప్పటి వరకు సినిమా చుట్టూ పెద్దగా హైప్ రాకపోవడంతో, మరింత ప్రచారం అవసరమని నెటిజన్లు సూచిస్తున్నారు.

కన్నప్ప కథ అందరికీ తెలిసినప్పటికీ, ఇందులో కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయని మేకర్స్ చెబుతున్నారు. ఉత్తరాది మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ మహాకుంభమేళా తరహా ఆధ్యాత్మిక ప్రచారం చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే, కన్నప్ప పాన్-ఇండియా హిట్‌గా నిలిచే అవకాశముందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి, మేకర్స్ ఇకపై ఏ విధంగా పథకం వేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular