
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న సీక్వెల్ ప్రాజెక్ట్‌కి ఇప్పుడు మరింత క్రేజ్ పెరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను “ఈఎన్ఈ రిపీట్” అనే టైటిల్‌తో ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పుడు ఓ క్రేజీ రూమర్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆ రూమర్ ఏంటంటే.. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యామియోలో కనిపించనున్నారట.
విశ్వక్ సేన్‌తో కలిసి ఓ రచ్చ రచ్చ సన్నివేశంలో బాలయ్య ఓ సాలిడ్ సర్ప్రైజ్ క్యారెక్టర్ చేస్తారని టాక్. అది కేవలం కొన్ని నిమిషాల సన్నివేశమే అయినా, స్క్రీన్ మీద అది మాస్ ట్రీట్ అవుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
ఇలాంటి క్యామియో నిజమైతే థియేటర్లలో హంగామా ఖాయం. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ సోషల్ మీడియాలో బాలయ్య పాత్రపై చర్చలు వేగంగా నడుస్తున్నాయి.
