
న్యూస్ డెస్క్: ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు బెంగళూరు సివిల్ కోర్టులో చుక్కెదురైంది. కన్నడ భాషపై అనవసర వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తమిళ భాష నుంచే కన్నడ పుట్టిందని గతంలో వ్యాఖ్యానించిన కమల్ హాసన్‌కు ఈ వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. దీంతో ఆయనపై పలు సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.
కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మహేశ్ వూరాలా పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు విచారించి ఆగస్టు 30వ తేదీన కమల్ వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.
అంతేకాక, భవిష్యత్తులో కన్నడ భాష, భూమి, సంస్కృతి గురించి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. కమల్ వ్యాఖ్యలతో ‘థగ్ లైఫ్’ సినిమా కర్ణాటకలో నిలిపివేయబడింది.
వివాదంపై కమల్ ఇప్పటికీ క్షమాపణ చెప్పకపోవడంతో, కన్నడ అభిమానుల్లో ఆగ్రహం కొనసాగుతోంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన తదుపరి చర్యలు ఏమవుతాయన్నది ఆసక్తికరం.
ఈ పరిణామం కన్నడ-తమిళ సినీ వర్గాల్లో మరోసారి భాషా వివాదాలను తెరపైకి తీసుకొచ్చింది.