Monday, August 24, 2026
HomeSportsఅయ్యర్ కెప్టెన్సీ ఎగ్జిట్: ఒక్క వైఫల్యానికే ఇంత కఠిన నిర్ణయమా?

అయ్యర్ కెప్టెన్సీ ఎగ్జిట్: ఒక్క వైఫల్యానికే ఇంత కఠిన నిర్ణయమా?

iyer-captaincy-exit-bcci-criticismIyer

స్పోర్ట్స్ డెస్క్: టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఒకే మ్యాచ్‌లో వచ్చిన వైఫల్యానికి ఇంతటి పరిణామం జరగడం అనేక సందేహాలకు తావిస్తోంది.

ఆస్ట్రేలియా-ఎతో రెండో టెస్ట్‌కు ముందు అనూహ్యంగా తన రాజీనామా ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మొదటి మ్యాచ్‌లో కేవలం 8, 13 పరుగులే చేయడం, అంపైరింగ్ వివాదం కారణం అని చెప్పినా, అసలు ఒత్తిడి మాత్రం సెలెక్టర్ల నుంచే వచ్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయ్యర్ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడిని ఒకే ఫెయిల్యూర్‌కు ఈ స్థాయిలో ప్రెజర్ పెట్టడం సరైన పద్ధతి కాదని అభిమానులు అంటున్నారు. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీలో అతని కీలక పాత్రను మరచిపోవడం దురదృష్టకరం అని అంటున్నారు.

భారత క్రికెట్‌లో ఆటగాళ్లకు స్థిరత్వం లేకపోవడం ఇదే మొదటి సారి కాదు. ఒక మ్యాచ్ ఫెయిలైతేనే అవకాశాలు కత్తిరించడం ఆటగాళ్లలో భయం పెంచుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ పరిణామం అయ్యర్ కెరీర్‌పై ప్రభావం చూపనుందా అనే ప్రశ్న అభిమానులను ఆందోళనలో పడేస్తోంది. రాబోయే సిరీస్‌ల్లో అతనికి అవకాశాలు దొరుకుతాయా అన్నది వేచి చూడాలి.

ఏదేమైనా, ఒక్క పరాజయం కారణంగానే కెప్టెన్సీ కోల్పోవడం బీసీసీఐ నిర్ణయాలపై పెద్ద డిబేట్‌కు దారితీసింది. అభిమానులు, నిపుణులు ఇకపై ఆటగాళ్లకు మరింత నమ్మకం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

MalCare WordPress Security Plugin - Malware Scanner, Cleaner, Security Firewall Firewall

Blocked because of Malicious Activities

Reference ID: 15973155606a8bdff7a57fa