
న్యూస్ డెస్క్: భారత ఆటోమొబైల్ రంగంలో చరిత్ర సృష్టించిన ఘట్టం ఇది. మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ ఒక్కరోజులోనే 25 వేల కార్లను వినియోగదారుల చేతికి అందించి కొత్త రికార్డు నెలకొల్పింది. కంపెనీ 35 ఏళ్ల చరిత్రలో ఇది తొలిసారి జరిగిన ఘనత.
పండుగ సీజన్ ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా వాహన కొనుగోళ్లలో ఊపందుకుంది. వినియోగదారులు కొత్త వాహనం కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఈసారి GST మార్పులు, తక్కువ EMIలు కారణంగా బుకింగ్స్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
మారుతీతో పాటు హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు కూడా ఈ సీజన్‌ను బాగా ఎంజాయ్ చేశాయి. హ్యుందాయ్ 11 వేల, టాటా 10 వేల కార్లను ఒకేరోజులో డెలివరీ చేశాయి. ఇది ఆటో రంగంలో బలమైన రికవరీని సూచిస్తోంది.
వాహన మార్కెట్ విస్తరణకు మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరగడం కూడా ప్రధాన కారణం. అదనంగా కొత్త మోడళ్లు, టెక్నాలజీ అప్‌డేట్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి.
నిపుణుల అంచనా ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ మోడళ్లు రాబోయే రోజుల్లో మరింత బూమ్ తెస్తాయి. పోటీ పెరిగే కొద్దీ వినియోగదారులకు మంచి ధరలు, నాణ్యమైన మోడళ్లు దొరకనున్నాయి.
మారుతీ రికార్డు భవిష్యత్తులో ఇండియన్ ఆటో రంగానికి బలమైన సంకేతం. వాహన పరిశ్రమ దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా మారబోతోందని స్పష్టంగా కనిపిస్తోంది.
