Monday, October 5, 2026
HomeBig Storyఐపీఎల్‌కు బిగ్ బ్రేక్: బీసీసీఐ సంచలన నిర్ణయం

ఐపీఎల్‌కు బిగ్ బ్రేక్: బీసీసీఐ సంచలన నిర్ణయం

ipl-2025-postponed-bcci-announcement

స్పోర్ట్స్ డెస్క్: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న తరుణంలో బీసీసీఐ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించింది.

ఆటగాళ్లు, సిబ్బంది, ప్రేక్షకుల భద్రతే ముఖ్యమని బీసీసీఐ అధ్యక్షుడు స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలతో ధర్మశాల మ్యాచ్ మధ్యలో నిలిచిన తర్వాత భద్రతపై చర్చలు మొదలయ్యాయి.

విదేశీ ఆటగాళ్ల భద్రతా ఆందోళనలు, వారి బోర్డుల సూచనలు కూడా బోర్డు నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. ఐపీఎల్ ఆర్థికంగా భారీగా దెబ్బతింటుందన్నా, జాతీయ భద్రత ముందు ఏది ఎక్కువకాదని బోర్డు స్పష్టం చేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు టోర్నీ పునఃప్రారంభమవుతుందన్నది అంతి స్పష్టంగా చెప్పలేమని అధికారులు తెలిపారు. అభిమానులు ఈ వార్తతో నిరాశ చెందుతున్నా, క్రికెట్ విశ్లేషకులు దీనిని బాధ్యతాయుత నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు.

ముఖ్యంగా ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు, స్పాన్సర్లకు త్వరలోనే బీసీసీఐ మరిన్ని వివరాలను అందించనున్నట్లు తెలుస్తోంది. క్రమంగా పరిసర పరిస్థితులు మెరుగైతే తిరిగి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular