
న్యూస్ డెస్క్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. 121 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనను ఐదో రోజు ఆటలో భారత్ సులభంగా పూర్తి చేసింది.
బ్యాట్స్‌మెన్‌లు కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ అద్భుత ప్రదర్శన చూపించారు. ఈ విజయంతో భారత క్రికెట్ జట్టు మరోసారి తమ సత్తాను ప్రపంచానికి చాటింది.
ఐదో రోజు ఆటను 63/1తో ప్రారంభించిన భారత్, కేఎల్ రాహుల్ అద్భుత హాఫ్ సెంచరీ (58 నాటౌట్)తో విజయ లక్ష్యాన్ని చేరుకుంది. సాయి సుదర్శన్ (39), ధ్రువ్ జురెల్ (13 నాటౌట్) రాణించారు.
తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌పై తిరుగులేని ఆధిక్యం దక్కడం ఈ విజయాన్ని సులభతరం చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ రెండు, జోమెల్ వారికన్ ఒక వికెట్ తీశారు.
రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ గట్టి పోరాటం చేసింది. జాన్ కాంప్‌బెల్ (115), షై హోప్ (103) అద్భుతమైన సెంచరీలతో మెరిశారు. జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), రోస్టన్ ఛేజ్ (40) కూడా రాణించడంతో విండీస్ 390 పరుగులకు ఆలౌటైంది.
భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ నాలుగు, జస్‌ప్రీత్ బుమ్రా మూడు, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 518 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129) సూపర్ సెంచరీలతో చెలరేగారు.
యశస్వితో సమన్వయం కోల్పోయి రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం బౌలింగ్‌లో కుల్‌దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) అదరగొట్టడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే ఆలౌటై, ఫాలో ఆన్‌లో పడింది.
మొదటి నుంచి బ్యాట్స్‌మెన్, బౌలర్లు సమన్వయంగా రాణించడంతో టీమ్‌ఇండియా మరోసారి విండీస్‌పై ప్రభంజనం సృష్టించి క్లీన్‌స్వీప్‌తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
