Saturday, March 7, 2026
HomeSportsIND vs ENG: ఐదో టెస్టుకు ఊహించని బ్రేక్

IND vs ENG: ఐదో టెస్టుకు ఊహించని బ్రేక్

india-england-fifth-test-rain-halts-batting

స్పోర్ట్స్ డెస్క్: లండన్‌లోని ఓవల్ స్టేడియంలో భారత్ – ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ప్రారంభమైన మొదటి రోజే వర్షం మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా, తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.

అయితే ఈ దశలో వర్షం పడటంతో ఆట నిలిచిపోయింది. వెంటనే అంపైర్లు ముందుగానే లంచ్ బ్రేక్ ప్రకటించారు.

భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ఎక్కువగా నిలదొక్కుకోలేకపోయారు. యశస్వి జైస్వాల్ 2 పరుగులు చేసి అవుట్ కాగా, కేఎల్ రాహుల్ 14 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. మొదటి 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియాను యువ బ్యాటర్ సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సమయంలో సుదర్శన్ 25 పరుగులు, గిల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ ఆట్కిన్సన్, క్రిస్ వోక్స్ తలో వికెట్ పడగొట్టారు. వర్షం కారణంగా ఆట నిలిచినప్పటికీ, ఆట కొనసాగితే భారత్ పరవాలేదనిపించే స్థాయిలో నిలబడినట్టు కనిపిస్తోంది.

ఈ మ్యాచ్‌లో విజయం కోసం భారత్ తీవ్రంగా పోరాడాల్సిన అవసరం ఉంది. వర్షం ఆటను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అభిమానులు మళ్లీ మ్యాచ్ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular