
అమెరికా: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ రష్యా మధ్య వాణిజ్య ఒప్పందాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాలు ఏమైనా ఒప్పందం చేసుకున్నా తమకు సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. ట్రంప్ ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ ద్వారా తెలిపారు.
భారత్, రష్యా తమ ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకుంటున్నాయని తన అభిప్రాయం వెల్లడించారు. ఇక భారత్‌పై ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ఇండియా తన దేశంపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తోందని, అందుకే అమెరికా భారత్ మధ్య వ్యాపారం చాలా తక్కువగా సాగుతోందని వివరించారు.
గతంలో భారత్ దిగుమతులపై 25 శాతం సుంకం విధించిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యంగా భారత్ రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తోందని, ఇదే తాము టార్గెట్ చేయడానికే సుంకాలు విధించామని ట్రంప్ చెప్పారు.
రష్యా, అమెరికా మధ్య వ్యాపార ఒప్పందాలు ఏవీ లేవని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు, రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ వ్యాఖ్యలను ట్రంప్ వ్యంగ్యంగా తీరిగ్గా స్పందించారు. తాము వాషింగ్టన్ గేమ్ ఆడుతున్నామంటూ మెద్వెదేవ్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ, “బహుశా ఆయన ఇంకా అధ్యక్షుడిగా ఉన్నానని అనుకుంటున్నారేమో” అని అన్నారు.
ప్రస్తుతం భారత్ రష్యా మధ్య చమురు, ఇతర రంగాల్లో వాణిజ్య ఒప్పందాలు జరుగుతుండగా.. ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించాయి.
