
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా సందిగ్ధంలో పడింది. ఇప్పటికే అనేక మార్లు పోస్ట్ పోన్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు జూన్ ట్రైలర్ రిలీజ్ హైప్‌ను కూడా నెరవేర్చకపోవడంతో అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది.
ట్రైలర్ జూన్ మొదటి వారంలోనే వస్తుందని టాక్ ఉన్నా, ఇప్పుడు మూడో వారం దగ్గర పడుతున్నా కూడా ఎటువంటి అప్‌డేట్ లేదు. చిత్రబృందం నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడం మరింత గందరగోళాన్ని పెంచుతోంది. జూలైలో సినిమా రిలీజ్ కాకపోతే, ఆ తర్వాత వచ్చే ఓజి ఫోకస్‌ను పూర్తిగా ఆకర్షించే అవకాశం ఉందన్న భావన అభిమానుల్లో ఉంది.
జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఇక దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు పలు ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించినట్టు సమాచారం.
ఇప్పటికైనా ట్రైలర్‌కి తేదీ ప్రకటిస్తే, అభిమానుల్లో మళ్లీ ఆసక్తి పెరుగుతుంది. లేదంటే, ఈ సినిమాలోపై హైప్ తగ్గిపోవడం ఖాయం అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
harihara veeramallu trailer, pawan kalyan movie update, og vs hari hara release, jyothi krishna direction, keervani music film,