Monday, April 13, 2026
HomeSportsభారత్ ఆతిథ్యంతో మహిళల వన్డే వరల్డ్‌కప్.. దాయాదుల పోరుకు బిగ్ హైప్

భారత్ ఆతిథ్యంతో మహిళల వన్డే వరల్డ్‌కప్.. దాయాదుల పోరుకు బిగ్ హైప్

womens-world-cup-india-hosts-indpak-match-oct5

స్పోర్ట్స్ డెస్క్: ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి మహిళల వన్డే వరల్డ్‌కప్ భారత్‌లో ప్రారంభం కానుంది. 2013 తర్వాత భారత్ మరోసారి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం విశేషం. ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీకి రౌండ్-రాబిన్ ఫార్మాట్ లో జరుగుతుంది.

భారత్ తొలిపోరును సెప్టెంబర్ 30న బెంగళూరులో శ్రీలంకతో జరిపించనుంది. తర్వాత అక్టోబర్ 5న పాక్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. పాక్ అన్ని మ్యాచ్‌లు కొలంబోలోనే ఆడనుంది.

అక్టోబర్ 9న భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ విశాఖలో, అక్టోబర్ 12న ఆస్ట్రేలియాతో అదే వేదికలో జరగనుంది. ఇండోర్‌లో అక్టోబర్ 19న ఇంగ్లాండ్‌తో, అక్టోబర్ 23న గౌహతిలో న్యూజిలాండ్‌తో పోటీ పడుతుంది. అక్టోబర్ 26న బంగ్లాదేశ్‌తో బెంగళూరులో లీగ్‌ దశ ముగుస్తుంది.

ఈ టోర్నీలో మొత్తం 28 లీగ్, 3 నాకౌట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. సెమీ ఫైనల్స్ అక్టోబర్ 29, 30న గౌహతి, బెంగళూరులో; ఫైనల్ నవంబర్ 2న బెంగళూరు లేదా కొలంబోలో జరగనుంది.

ఆతిథ్య భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఈ టోర్నీకి అర్హత పొందాయి. అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular