Monday, January 19, 2026
HomeNationalతగ్గిన GST తో దీర్ఘకాలిక రోగులకు ఊరట.. రూ.2 లక్షల ఆదా

తగ్గిన GST తో దీర్ఘకాలిక రోగులకు ఊరట.. రూ.2 లక్షల ఆదా

gst-benefits-for-chronic-patients-cost-reduction

న్యూస్ డెస్క్: దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన GST 2.0 సంస్కరణలు వైద్యరంగానికే పెద్ద ఊరట కలిగించాయి. ఇప్పటివరకు 18 శాతం పన్ను పరిధిలో ఉన్న పలు మందులపై పన్ను 5 శాతానికి తగ్గించబడింది. అంతేకాకుండా 36 రకాల ఔషధాలపై పూర్తిగా పన్ను ఎత్తివేయడం జరిగింది.

దీంతో దీర్ఘకాలిక రోగులు ఇకపై చికిత్సపై సగటున రూ.2 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త విధానం సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చింది.

ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, ఫ్యాటీ లివర్, క్యాన్సర్ వంటి రోగాల చికిత్స ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి. ఇండియన్ ఫార్మస్యూటికల్ అలయన్స్ (IPA) చేసిన అధ్యయనాలు కూడా ఇదే సూచిస్తున్నాయి.

అదేవిధంగా అరుదైన వ్యాధులు, జన్యుపరమైన రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఇది ఉపశమనం అవుతుంది. దేశవ్యాప్తంగా సుమారు 72.6 మిలియన్ల అరుదైన వ్యాధిగ్రస్తులు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. వీరిలో చాలా మంది ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతుంటారు.

కొత్త పన్ను విధానంతో ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా చికిత్స మరింత చౌకగా లభించనుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ రోగులకు సుమారు రూ.4 లక్షల వరకు ఆదా అవుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఔషధాలతో పాటు ల్యాబ్ పరీక్షలు, డయాగ్నస్టిక్స్ సేవలపై కూడా ఖర్చులు తగ్గనున్నాయి. దీంతో మధ్య తరగతి, సామాన్య కుటుంబాలకు ఇది పెద్ద ఊరట అవుతుంది.

మొత్తానికి జీఎస్టీ సంస్కరణలు ఆరోగ్యరంగంలో గేమ్‌చేంజర్‌గా మారి, ప్రజలకు ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular