fbpx
Wednesday, June 11, 2025
HomeInternationalప్రపంచ సైనిక వ్యయం రికార్డు స్థాయికి: భారత్ ఐదో స్థానం

ప్రపంచ సైనిక వ్యయం రికార్డు స్థాయికి: భారత్ ఐదో స్థానం

global-defence-spending-hits-record-india-ranks-fifth

అంతర్జాతీయం: ప్రపంచ దేశాలు భద్రతాపరంగా మరింత చురుగ్గా మారుతున్న దృష్ట్యా, 2024లో గ్లోబల్ సైనిక వ్యయం చరిత్రలోనే అత్యధికంగా 2.44 ట్రిలియన్ డాలర్లకు చేరింది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఇది గత ఏడాదితో పోలిస్తే 6.8% అధికం.

అగ్రరాజ్యం అమెరికా 997 బిలియన్ డాలర్లతో (జీడీపీలో 3.4%) మొదటి స్థానంలో ఉండగా, చైనా 314 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది. రష్యా 149 బిలియన్ డాలర్ల వ్యయంతో మూడో స్థానాన్ని ఆక్రమించింది.

జర్మనీ 88.5 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉండగా, భారత్ 86.1 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఇది 2023తో పోలిస్తే 1.6% అధికం. గత దశాబ్దంలో భారత్ సైనిక వ్యయం 42% పెరిగింది.

భారత్ రక్షణ రంగంలో స్వదేశీకరణకు పెద్దపీట వేస్తూ, కొత్త ఆయుధాల కొనుగోలులో 75% “మేడ్ ఇన్ ఇండియా” ఉత్పత్తులకు కేటాయించడం గమనార్హం.

ఉక్రెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నా, ఉక్రెయిన్ జీడీపీలో 34%ను సైనిక వ్యయానికి కేటాయించడం విశేషం.

 global defence spending, india military budget, sipri report 2024, china us russia defence, made in india defence policy,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular