
తెలంగాణ: గద్వాల జిల్లాలోని ఓ ప్రైవేట్ సర్వేయర్ దారుణ హత్యకు గురైన కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పెళ్లైన నెలలోనే భర్తను హత్య చేయించిన కేసులో భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత అరెస్టయ్యారు.
తేజేశ్వర్ అనే యువకుడు ఐశ్వర్యను మే 18న వివాహం చేసుకున్నాడు. కానీ పెళ్లయిన రెండో రోజునుంచే ఆమె ప్రవర్తన మారింది. జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు. అనంతరం పాణ్యం సమీపంలో అతని మృతదేహం దొరికింది.
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు, ఐశ్వర్య-ఆమె తల్లి సుజాతలు కలసి హత్యకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. ఐశ్వర్యకు ఆమె తల్లి ప్రియుడు, అదే బ్యాంకులో పనిచేసే ఉద్యోగితో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది.
తేజేశ్వర్ అడ్డుపడుతున్నాడని భావించి, సుపారీ కిల్లర్లతో హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడిని కారులో తీసుకెళ్లి మార్గంలోనే గొంతు కోసి హతమార్చినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఐశ్వర్య, సుజాతలు పోలీసుల కస్టడీలో ఉండగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
gadwal murder, wife kills husband, surveyor tejeshwar, illegal affair, supari murder case,