
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు అన్ని విధాలా సహకరించారు. అయినా కూడా సినిమాకి ఉన్న హైప్‌కు తగ్గ హిట్ అందలేకపోయింది.
ఈ నేపథ్యంలో దిల్ రాజు – రామ్ చరణ్ కాంబో మరోసారి రిపీట్ అవుతుందా అనే చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడు దీనిపై అధికారిక క్లారిటీ వచ్చేసింది.
తమ్ముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన దిల్ రాజు… “చరణ్‌తో మరో సూపర్ హిట్ సినిమా తీస్తాం, అది మా బ్యానర్‌లోనే ఉంటుంది. ఇప్పటికే దానికి సంబంధించిన చర్చలు మొదలయ్యాయి” అని ప్రకటించారు.
ఇది వింటూ మెగా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ – దిల్ రాజు కాంబినేషన్‌లో వేరే జానర్‌లో సినిమా ఉండే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ కాంబోపై అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశముంది.