
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగే. ప్రతి ఆగస్టు 22న ఆయన కొత్త సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూడడం పరంపరలా మారింది. ఈసారి కూడా అభిమానులు ‘విశ్వంభర’ నుంచి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈసారి చిరు బర్త్ డే స్పెషల్‌గా ‘విశ్వంభర’ అప్‌డేట్ ఉండకపోవచ్చని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు వర్క్ ఇంకా పూర్తిగా ముగియలేదని, టీజర్ కూడా సిద్ధంగా లేదని టాక్.
ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కోసం చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘స్టాలిన్’ను రీ-రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
విశ్వంభర కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది తాత్కాలిక ఊరటగా మారొచ్చు. అయితే ఈ రీ-రిలీజ్ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ కన్ఫర్మ్ అయితే, థియేటర్లలో మరోసారి స్టాలిన్ మేజిక్ చూడొచ్చు.