
పాన్ ఇండియా సినిమాల జోరు ఇప్పుడు కొత్త కాదు. చాలా ఏళ్ళ క్రితమే బాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు మొదలయ్యాయి. అందులో ‘ధూమ్’ సిరీస్ ప్రత్యేక స్థానం సంపాదించింది. మూడు పార్ట్స్ తో వచ్చిన ఈ ఫ్రాంచైజ్ యాక్షన్, స్టైలిష్ ప్రెజెంటేషన్ తో ప్రేక్షకులను అలరించింది.
ప్రతి భాగం హిట్ అవ్వడం తో ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ సిరీస్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి నాలుగో భాగంలో కొత్త సర్ప్రైజ్ ఉంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
లేటెస్ట్ రూమర్స్ ప్రకారం, ధూమ్ 4లో టాలీవుడ్ హీరోని తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇది విన్న వెంటనే తెలుగు ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ పెరిగింది. ఏ స్టార్ హీరో అని మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు.
ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్న దర్శకుడ అయాన్ ముఖర్జీ, ఇటీవల ‘వార్ 2’ తో వచ్చాడు. కథలో కీలకమైన పాత్ర కోసం తెలుగు హీరోని ఆలోచించారని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి నిజంగానే తెలుగు హీరో ఈ సిరీస్ లో చేరతారా? లేక ఇది మరో రూమర్ మాత్రమేనా అన్నది తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.
