
ఉప్పల్: ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరగనున్న మ్యాచ్‌కి ముందు డీసీ విడుదల చేసిన వీడియో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఆడియోను బ్యాక్‌గ్రౌండ్‌గా ఉపయోగించి, ఢిల్లీ ఆటగాడు సమీర్ రిజ్వీ రామ్ చరణ్ చేసిన ఒక స్టెప్‌ను స్టైల్‌గా రీక్రియేట్ చేశాడు.
ఈ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయగా, వెంటనే ‘పెద్ది’ టీమ్ రీట్వీట్ చేసింది. దీంతో వీడియో నెట్టింట వైరల్ అయింది. మెగా అభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఆనందంతో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఈరోజు ఎస్ఆర్హెచ్కు గెలుపు అత్యంత కీలకం. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించిన హైదరాబాద్, ప్లేఆఫ్స్ ఆశలను నిలుపుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిందే.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ఆరు విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌ను గెలిచి టాప్ 4కి దూసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.