
సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీకు సంబంధించి ఓవర్సీస్‌లో ఓ భారీ బిజినెస్ పూర్తయింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో మాఫియా థీమ్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా అన్ని భాషల కలిపి కూలీ ఓవర్సీస్ హక్కులు ఏకంగా రూ.81 కోట్లకు డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. ఇది కోలీవుడ్ ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత పెద్ద డీల్‌గా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. రజనీ క్రేజ్, లోకేష్ మాస్ టచ్‌కి ఇది నిదర్శనం.
ఈ సినిమాతో రజనీ కొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఇప్పటికే గ్లింప్స్‌కు అభిమానుల నుంచి విపరీత స్పందన వస్తోంది. అనిరుధ్ సంగీతం, శ్రుతి హాసన్, నాగార్జున వంటి భారీ తారాగణం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
అమెరికా, జీసీసీ, యూకే, ఆస్ట్రేలియా, మలేషియా మార్కెట్లలో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. వింటేజ్ రజనీ మాస్ యాంగిల్‌ను టీజర్‌లో చూపించిన లోకేష్, థియేటర్లో అదే స్థాయిలో ఆడియెన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్తాడని అంచనాలు ఉన్నాయి.
కూలీ ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ బిజినెస్ డీల్ సినిమాపై హైప్‌ను రెట్టింపు చేసింది. అయితే చివరికి విజయాన్ని నిర్ణయించేది కంటెంట్‌నే అని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.
coolie movie business, rajinikanth lokesh kanagaraj, coolie overseas rights, tamil movie records, indian cinema news,