
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే 1000 కోట్ల మార్క్ చేరుతుందని భావించినా, ఆ స్థాయికి చేరుకోలేకపోయింది.
అయినప్పటికీ ఈ చిత్రం రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రజనీ పవర్ మరోసారి నిరూపించింది.
ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా ఓటీటీ ప్రీమియర్‌పై పడింది. తాజా సమాచారం ప్రకారం కూలీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.
ఈ నెల 11వ తేదీ నుంచే సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందనే వార్తలు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. థియేటర్స్ మిస్ చేసిన అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
సినిమాలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, రచితా రామ్ వంటి స్టార్ కాస్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రత్యేకంగా రజనీ, నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఫుల్ ఎంటర్టైన్ చేసింది.