
IND vs ENG: బెన్‌స్టోక్స్‌పై స్పోర్ట్స్‌మేన్‌షిప్‌పై విమర్శలు
స్పోర్ట్స్ డెస్క్: మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు డ్రా కావడం క్రికెట్ అభిమానులను ఆనందింపజేసినప్పటికీ, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీరు మాత్రం విమర్శలకు దారి తీశింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 358 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ 669 పరుగుల భారీ స్కోరు చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా, గిల్ (103), రాహుల్ (90), జడేజా (107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్) అద్భుతంగా పోరాడి మ్యాచ్‌ను డ్రా చేశారు.
మ్యాచ్ చివరలో బెన్ స్టోక్స్ ఆట తీరు స్పోర్ట్స్‌మేన్‌షిప్‌కు విరుద్ధంగా ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. భారత బ్యాటర్లు సెంచరీలకు దగ్గరగా ఉన్నప్పుడు, సిరీస్ కోల్పోతున్న భావనతో ప్రత్యర్థిపై స్లెడ్జింగ్ చేశారు.
డ్రా ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా ప్రధాన బౌలర్లు అలసిపోయారంటూ కారణం చెప్పడం విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా హారీ బ్రూక్‌ను బౌలింగ్‌కు తీసుకురావడం, ఫుల్‌టాస్‌లు వేయించడం సెంచరీ చేయడానికే ప్రోత్సహించడం లాంటి చర్యలు అసలు క్రికెట్ స్ఫూర్తికి దూరంగా ఉన్నాయని అభిమానులు అంటున్నారు.
భారత్ బ్యాటర్లు ఈక్రమంలో గౌరవంగా ఆటను ముగించారు. జడేజా, సుందర్ అద్భుత శతకాలు సాధించడంతో టీమ్‌ఇండియా మళ్ళీ పుంజుకుంది. కానీ స్టోక్స్ తన జట్టు విజయం సాధిస్తే సంబరపడడం, ప్రత్యర్థి గొప్పగా ఆడితే మాత్రం స్పందించకపోవడం విమర్శలకూ, క్రికెట్ స్ఫూర్తిపై ప్రశ్నలకూ దారితీసింది.