
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా చర్చనీయాంశం అవుతున్న సినిమా అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో వస్తున్న భారీ ప్రాజెక్ట్. పుష్ప-2 తర్వాత బన్నీ హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులపై ఇండస్ట్రీలో హాట్ టాక్ వినిపిస్తోంది.
సన్ పిక్చర్స్ ఈ సినిమాను దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్లు, టాప్ హీరోయిన్స్, గ్రాండ్ సెటప్స్ తో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అల్లు అర్జున్ ఇందులో పవర్ఫుల్ యోధుడిగా ద్విపాత్రాభినయం చేస్తాడని టాక్.
ఇక తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను కళ్లుచెదిరే రేంజ్ లో సొంతం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముంబైలో జరిగిన స్టార్ స్టడెడ్ పార్టీ లోనే ఈ డీల్ ఫైనల్ అయినట్టు సమాచారం.
నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకి సుమారు ₹280 నుంచి ₹300 కోట్ల వరకు చెల్లించినట్టు చెప్పుకుంటున్నారు. ఈ మొత్తం ఓటీటీ మార్కెట్ లో రికార్డు స్థాయి డీల్ గా భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ సినిమా షూటింగ్ త్వరలో దుబాయ్ లో ప్రారంభం కానుంది. ఇప్పటికే వర్క్‌షాప్ లు పూర్తయ్యాయి. అల్లు అర్జున్ ఎంట్రీ సాంగ్ కూడా షూట్ చేశారట.
మొత్తానికి బన్నీ – అట్లీ కాంబో సినిమా థియేటర్స్ లో మాత్రమే కాదు, ఓటీటీ మార్కెట్ లో కూడా అలరించేలా డీల్ కుదిరింది. ఫైనల్ అవుట్‌పుట్ కోసం ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
