న్యూస్ డెస్క్: దేశవ్యాప్తంగా విషాదం కలిగించిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించింది.
గత జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన 32 సెకన్లకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 241 మంది మృతి చెందారు.
ఈ ప్రమాదంలో కేవలం సీటు నంబర్ 11ఏలో కూర్చున్న ఒక ప్రయాణికుడే ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలినవారు సజీవదహనమయ్యారు.
దర్యాప్తు బృందాలు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR), ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) ఆధారంగా వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నాయి.
టేకాఫ్ సమయంలో ఫ్యూయల్ స్విచ్‌లను పిలట్‌లు పొరపాటుగా ఆఫ్ చేశారా? అనే కోణంలో పరిశీలన జరుగుతోంది. రెండు ఇంజిన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యాయా? అనే అంశంపైనా దృష్టి సారించారు.
ఈ వారంలో నివేదికను పబ్లిక్ చేయనున్న AAIB, ప్రమాదానికి గల స్పష్టతను అందించనుంది.