
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. కోయంబత్తూర్ లోని ఈషా యోగా సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధి పద్ధతిలో వీరి వివాహం జరిగింది.
సమంత రాజ్ వివాహం తర్వాత రాజ్ చిన్నమ్మ ప్రముఖ సింగర్ శోభా రాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సమంత గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు కూడా ఆమె బయట పెట్టారు.
శోభా రాజ్ మాట్లాడుతూ.. “సమంత మా కుటుంబంలోకి కోడలుగా రావడం మా అదృష్టం. చాలా మంచి అమ్మాయి. పద్ధతిగా ఉంటుంది” అని తెలిపారు. “ముఖ్యంగా ఆ అమ్మాయి మా రాజ్ జీవితంలోకి రావడం మరింత సంతోషంగా ఉంది” అంటూ సమంతపై తన ప్రేమను చూపించారు.
ఆమె సమంతతో పరిచయం గురించి చెబుతూ.. “ఈషా ఫౌండేషన్ లో సమంతను ఇప్పటికే రెండు మూడు సార్లు కలిసాను. ఆ సమయంలో ఆమె చాలా సన్నగా ఉండేది. అప్పుడే నేను కూడా కొంచెం సన్నగా అవ్వాలంటే ఏం చేయాలని అడిగాను” అని తెలిపారు.
సమంత దేవుడిపై ఎంతో భక్తి ఉన్న అమ్మాయి అన్నారు. “రాజ్ కి కూడా దైవభక్తి ఎక్కువ” అని చెబుతూ, అలాంటి అమ్మాయి మా జీవితంలోకి రావడం మరింత సంతోషంగా ఉందని శోభా రాజ్ వివరించారు.
