Tuesday, March 10, 2026
HomeMovie News'దేవర' నిరాశ.. 'పెద్ది' అయినా జాన్వీకి బ్రేక్ ఇస్తుందా?

‘దేవర’ నిరాశ.. ‘పెద్ది’ అయినా జాన్వీకి బ్రేక్ ఇస్తుందా?

janhvi-kapoor-peddi-movie-breakthrough-role-devara

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్, గ్లామర్ పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు పది సినిమాలు చేసినా, ఆమెలోని నటికి పూర్తిస్థాయిలో గుర్తింపు తెచ్చే ఒక్క బలమైన పాత్ర కూడా పడలేదు.

ఎన్నో అంచనాల మధ్య ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అందులోనూ ఆమె పాత్ర గ్లామర్‌కే పరిమితమై, నటనకు ఆస్కారం లేకపోయింది. దీంతో దక్షిణాదిలో ఆమెకు ఆరంభం నిరాశనే మిగిల్చింది.

ఈ నేపథ్యంలో, జాన్వీ తన ఆశలన్నీ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో చేస్తున్న ‘పెద్ది’ సినిమాపైనే పెట్టుకుంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో జాన్వీ పాత్ర చాలా భిన్నంగా ఉండబోతోంది.

ఇటీవల విడుదలైన ‘చికిరి చికిరి’ పాటలో జాన్వీ స్క్రీన్ ప్రెజెన్స్, చరణ్‌తో ఆమె కెమిస్ట్రీ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

‘పెద్ది’లో జాన్వీ పాత్ర కేవలం గ్లామర్ డాల్‌లా కాకుండా, కథను ముందుకు నడిపేంత బలమైనదని, పాత్రకు చాలా వెయిట్ ఉంటుందని సమాచారం. ‘ఉప్పెన’లో ‘బేబమ్మ’ పాత్రను మలిచిన బుచ్చిబాబు, జాన్వీ కోసం కూడా అలాంటి పవర్‌ఫుల్ పాత్రనే రాసినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న జాన్వీకి, ‘పెద్ది’ ఆ లోటును తీర్చి, ఆమెను నటిగా నిలబెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular